الجمعة، 22 نوفمبر 2019

General knowledge and CA

Important General knowledge

 and Current Affairs





దాతృత్వము లో వెనుకబడిన భారత్
*భారత్‌ దాతృత్వంలో బాగా వెనకబడి పోతోంది. గత పదేళ్ల కాలంలో 128 దేశాల్లో భారత్‌కు 82వ స్థానం లభించింది.
*‘వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌’---భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి అపరిచితుడికి సాయం చేయగా, ప్రతి నలుగురిలో ఒకరు డబ్బును దానం చేయగా, ప్రతి ఐదుగురిలో ఒకరు ఇతరుల కోసం స్వచ్ఛందంగా తమ సమయాన్నికేటాయిస్తున్నారు.
*దాతృత్వంలో భారత్, పొరుగునున్న పాకిస్థాన్, నేపాల్‌కన్నా వెనకబడి ఉంది.
*128 దేశాల్లోని 13 లక్షల మంది అభిప్రాయాలను గత తొమ్మిదేళ్లుగా సేకరించి ‘వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌’ ఈ వివరాలను వెల్లడించింది. 
*అధ్యయనం చేసేటప్పుడు సేకరించిన సమాచారం----  
1.ఇటీవల ఎప్పుడైనా అపరిచితులకు ఆర్థిక సహాయం చేశారా?
2.చారిటీ సంస్థలకు సహాయం చేశారా? 
3.ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా కృషి చేశారా? 
వంటి ప్రశ్నల ద్వారా అధ్యయనం చేపట్టారు.
*ఇతర దేశాలకు సంబంధించి ‘గాలప్‌ వరల్డ్‌ పోల్‌’, ‘యూకే చారిటీ’ సంస్థల డేటాతో తమ సమాచారాన్ని అధ్యయనకారులు పోల్చి చూశారు.
*2010లో దాతృత్వంలో భారత దేశ స్థానం 134 ఉండగా, గతేడాది గణనీయంగా 81 స్థానానికి చేరుకుంది. మళ్లీ ఈ ఏడాది ఒక స్థానం పెరిగి 82కు చేరుకుంది.
*భారతీయులకు దాతృత్వంలో 26 శాతం మార్కులను కేటాయించారు.  
*అమెరికాకు అత్యధికంగా 58 శాతం మార్కులు ఇచ్చారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన చైనా కేవలం 16 శాతం మార్కులతో  భారత్‌కన్నా ఎంతో వెనకబడింది. 
* న్యూజిలాండ్‌ ---అపరిచుతులకు సహాయం చేయడం, డబ్బు దానం చేయడం, ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛంగా సమయాన్ని కేటాయించడం.. మూడు కేటగిరీల్లో న్యూజిలాండ్‌ టాప్‌ టెన్‌లో నిలిచింది.
*ఈ అధ్యయనం ప్రకారం,భారత్‌లో పేదవాడు, పేదవాడికే సహాయం ఎక్కువ చేస్తున్నారు.
* ధనికుల వద్ద 21 లక్షల కోట్ల రూపాయలు వరకు ఉన్నాకూడా కొత్త వారికి సహాయం చేయడం లేదు.
*ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేసియా కూడా టాప్‌ టెన్‌లో ఉంది. అందుకు కారణం ఇతరులకు దానం చేయాలనే సూక్తి వారి ఇస్లాంలో ఉండడం, దాన్ని అక్కడి ప్రజలు బలంగా నమ్మడం. 
*ఈ అధ్యయనం ప్రకారం,చాలా దేశాల్లో దాన గుణం ఎక్కువ, తక్కువ ఉండడానికి కారణం వారి సంస్కృతులు, మత విశ్వాసాలు, వాటి పట్ల ప్రజలకున్న నమ్మకాలే   కారణం.

ఒక్క యాంటీ బయాటిక్ తో 12 వైరస్ ల పై దాడి 

*అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. 
*పేరు 1జీ01. 
*2017లో ఫ్లూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఒక రోగి శరీరంలో దీనిని గుర్తించారు.
*ఎలుకలపై పరిశోధనలు నిర్వహించగా ఈ యాంటీ బయాటిక్‌ మనుషుల్లో సోకే ఫ్లూ వైరస్‌లు సహా 12 రకాల వైరస్‌లను నిరోధించింది.
* మొదట ఎలుకలకు ఫ్లూ వైరస్‌లు ఎక్కించి 3 రోజుల తర్వాత యాంటీ బయాటిక్‌ ఇవ్వగా అది సమర్థంగా పని చేసింది. 
*అన్ని రకాల ఫ్లూ వైరస్‌లకు ఒకే మందును శాస్త్రవేత్తలు తయారు చేయనున్నారు.


1)👉 ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశమేది?

A: *జపాన్(1964)*

2)👉 మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఎవరి కాలంలో నిర్మించాడు?

A: *ఔరంగజేబు(మొఘలులు)*

3)👉 రామచరిత మానస్ ను రచించింది ఎవరు?

A: *తులసిదాస్*

4)👉 గాంధీజీ  ఆంగ్లంలో ప్రారంభించిన వారపత్రిక పేరేమిటి?

A: *యంగ్ ఇండియా*

5)👉భారత దేశంతో  అత్యధికంగా సరిహద్ధు పంచుకుంటున్న దేశమేది?

A: *బంగ్లాదేశ్*
  
6)👉 ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కు పోటీ చేసిన ఏకైక భారతీయుడు ఎవరు?

A: *శశిథరూర్*

7)👉 వైద్యుడి దర్పణం (doctors's mirror) అని ఏ దర్పణాన్ని అంటారు?

A: *పుటాకార దర్పణం*

8)👉 తెల్లబొగ్గు అని దేనిని అంటారు?

A: *జల విద్యుత్*

9)👉 హంపి ఏ నది ఒడ్డున కలదు?

A: *తుంగభద్ర*

10)👉 జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

A: *నవంబర్ 11*

       


Do not Delete prevent copying

Self Learners By Maniramakrishna

المشاركات الشائعة

Comments

Loom solar

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner

Loom solar 2