1)రష్యా టెన్నిస్ తార మారియా షరపోవా తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన కెరీర్లో ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్నారు.?
జ:- *ఐదు
(నోట్: 2005వ సంవత్సరంలో ఆమె ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచారు)
2)ఏ రోజు నుంచి దేశంలో కేవలం భారత్ స్టేజ్-6 (బీఎస్-6) వాహనాల అమ్మకాలుమాత్రమే జరగనున్నాయి..?
జ:- *1ఏప్రిల్ 2020
3)2022లో కామన్వెల్త్ షూటింగ్ అండ్ ఆర్చరీ చాంపియన్ షిప్ ఏ దేశంలో జరుగుతుంది..?
జ:- ఇండియా
4)Death An inside story అనే గ్రంధాన్ని ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అయితే దీనిని ఎవరు రచించారు..?
జ:- *జగ్జీ వాసుదేవ్ (సద్గురు అని పిలుస్తారు. ఈషా షౌండేషన్ వ్యవస్థాపకులు)
5)దేశంలో కొత్తగా ఏ రాష్ట్రంలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ యునివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు..?
జ:- *ఉత్తరప్రదేశ్
6)దేశంలో మొట్టమెదటగా.. ఏ రాష్ట్రం యునిఫైడ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ను ప్రవేశపెట్టింది..?
జ:- *మధ్యప్రదేశ్
7)ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద.. ఏ రాష్ట్రం 100శాతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను కలిగి ఉంది..?
జ:- *హిమాచల్ ప్రదేశ్
8)మార్చి 5, 2020న ఇస్రో ఏ జియో ఇమేజింగ్ శాటిలైట్ ను ప్రయోగించనుంది..?
జ:- *GISAT-1
9)Cash is King, but Digital is Divine ఈ కొత్త నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది ఎవరు.?
జ:- *రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10)ఫ్రాన్స్ లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ:- *జావెద్ అష్రాఫ్
1)ఫిబ్రవరి 28 ప్రత్యేకత..?
జ:- జాతీయ సైన్స్ దినోత్సవం.
(నోట్: ప్రఖ్యాత శాస్త్రవేత్త సి.వి రామన్.. ఇదే రోజున రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. *1930లో రామన్ కు నోబెల్ ప్రైజ్ వచ్చింది.)
2)ఇటీవలే ఏ రాష్ట్రంలో లోసార్ పండుగను జరుపుకున్నారు.?
జ:- *హిమాచల్ ప్రదేశ్
3) బాంబే హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసినది?
జ:- *జస్టిస్ భూషణ్ ప్రద్యుమ్న ధర్మాధికారి
4) వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం?
జ:- *ఘజియాబాద్
5) విజయవాడకు చెందిన ఎవరికి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2019 లభించింది?
జ:- *ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి
6) ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేసిన మలేషియా ప్రధాని ఎవరు?
జ:- *మహతీర్ మొహమద్
7) హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 నివేదిక ప్రకారం 140 డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచినది?
జ:- *అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
8) టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా రూ 1,480 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మిషన్ ?
జ:-*నేషనల్ టెక్నికల్ మిషన్
9)ఇటీవలే వసంతోత్సవ్ పేరిట ఏ రాష్ట్రం ప్రత్యేక జానపద పండుగను ఏర్పాటు చేసింది..?
జ:- *గుజరాత్ (అహ్మదాబాద్ లో)
10) శానిటరీ ప్రోడక్ట్స్ ను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన దేశం ఏది..?
జ:- *స్కాట్లాండ్
Source @joystudyworld
ليست هناك تعليقات:
إرسال تعليق
Thank you for your feedback