Daily General Knowledge and CA
@@నవంబరు 8వ తేదీ నాటికి పెద్దనోట్లను రద్దు చేసి మూడేళ్లు అవుతుంది.
@@పెద్ద నోట్ల రద్దు కు కారణాలు -ఒకటి నల్లధనాన్ని వెలికి తీయటం. రెండు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించడం.
@@నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్‌ఏఎస్) గణాంకాల ప్రకారం... 2011–12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉంది ఇప్పుడే.
@@ప్రజలు పొదుపు చేసే మొత్తంలో.. నగదు వాటా 2011–12లో 11.4 శాతం కాగా... 2017–18 నాటికి ఏకంగా 25.2 శాతానికి ఎగిసింది.
@@డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9 నుంచి 28 శాతానికి పడిపోయింది.
@@చలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్ల విలువలో ప్రజలు కరెన్సీ రూపంలో తమ దగ్గర దాచుకున్న నోట్ల విలువ 2011–12 నుంచి 2015–16 మధ్య 9–12 శాతంగా ఉండేది. 2017–18 లో ఇది 26 %కి పెరిగిపోయింది.
To get latest updates download Our app
@@ఆర్‌బీఐ 2018 నాటి నివేదిక ప్రకారం.. రద్దయిన నోట్లలో ఏకంగా 99.3% నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. వాటికన్నా అధిక విలువుండే రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టారు.
@@ రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ. 15.41 లక్షల కోట్లు, బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగొచ్చినది రూ. 15.30 లక్షల కోట్లు, వ్యవస్థలోకి తిరిగి రాని కరెన్సీ విలువ రూ. 10,720కోట్లు, తిరిగొస్తుందని ప్రభుత్వం అంచనా రూ. 10 లక్షల కోట్లు.
@@ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం 2016లో యూపీఐ ద్వారా 30 బ్యాంకుల నుంచి రూ.100 కోట్ల విలువైన 0.2 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
@@2018లో 128 బ్యాంకుల నుంచి రూ.74,978 కోట్ల విలువైన 482 మిలియన్ల లావాదేవీలు జరిగాయి.
@@ పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లలో డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 0.8 బిలియన్ల నుంచి 3.3 బిలియన్లకు... మొబైల్ వాలెట్ల లావాదేవీలు 0.32 బిలియన్ల నుంచి 3.4 బిలియన్లకు పెరిగాయి.
@@ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ముందుగా అంచనా వేసినట్లు 6.8 శాతం కాకుండా 6.1 శాతానికే పరిమితం కావొచ్చని ఆర్‌బీఐ ఇటీవలే పేర్కొంది. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 5.8%కే పరిమితం కావొచ్చని చెబుతున్నాయి. మందగమనానికి నోట్ల రద్దుతో పాటు ఇతరత్రా అంశాలూ కారణంగా మారుతున్నాయి.
@@ నోట్ల రద్దుతో వినియోగం గణనీయంగా దెబ్బతింది. ఉద్యోగాల కోత, ఆదాయాల తగ్గుదలకు, డిమాండ్ మరింత పడిపోవడానికి దారి తీసింది.
అమెరికా కీలక పదవుల్లో భారతీయులు
నలుగురు భారతీయ అమెరికన్లు తాజాగా అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు.
* వారిలో ఒక ముస్లిం మహిళ, మరో వైట్ హౌజ్ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు.
*గజాలా హష్మీ —-హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ (మున్నీ) అమెరికాలో చరిత్ర సృష్టించారు. చిన్నతనంలోనే (దాదాపు 50 ఏండ్ల కిందట) తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడిన ఆమె వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రికార్డులు సృష్టించారు.
*ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం 1979లో అమెరికాకు వలస వెళ్లింది.
* కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ మనోహర్ రాజు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్ కరొలినాలో చార్లట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు.
Source: Telegram Channels
No comments:
Post a Comment
Thank you for your feedback